రెబల్ స్టార్‌ కృష్ణంరాజు అంతిమయాత్ర ప్రారంభం

rebel-star-krishnam-raju-to be-cremated-with-state-honours

హైదరాబాద్ః సీనియర్‌ నటుడు, కేంద్రమాజీ మంత్రి రెబల్ స్టార్ కృష్ణంరాజు అంతిమయాత్ర ప్రారంభమైంది. అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. మొయినాబాద్‌ వద్ద కనకమామిడి ఫాంహౌస్‌లో ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. బీఎన్‌ఆర్‌ కాలనీ బ్రిడ్జ్‌, గచ్చిబౌలి, అప్పా జంక్షన్‌ మీదుగా మొయినాబాద్‌కు అంతిమయాత్ర సాగనుంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు (83) ఆదివారం తెల్లవారుజామున కన్నుమూసిన విషయం తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ దవాఖానలో తుదిశ్వాస విడిచారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఆయన భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. హీరో ప్రభాస్‌ సోదరుడు ప్రభోద్‌ చేతులమీదుగా ఆయన అంతిమ సంస్కారాలను నిర్వహిస్తారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/