వైస్సార్సీపీ లో రెబెల్ నేతలు పెరిగిపోతున్నారా..?

వైస్సార్సీపీ పార్టీ లో రెబెల్ నేతలు పెరిగిపోతున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వైస్సార్సీపీ పార్టీ గుర్తుతో నరసారావు పేట ఎంపీ గా రఘురామ కృష్ణం రాజు గెలిచినప్పటికీ మొదటి నుండి వైస్సార్సీపీ కి రెబెల్ గా మారాడు. ప్రభుత్వం చేసే ప్రతి వాటిని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు అలాంటి రఘురామలు పెరిగిపోతున్నట్లు తెలుస్తుంది. గత కొద్దీ నెలలుగా సొంత పార్టీ లో ఉంటూనే సొంత పార్టీ కి వ్యతిరేకంగా మాట్లాడడం చేస్తూ వస్తున్నారు.

నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి, ద‌ర్శి ఎమ్మెల్యే మ‌ద్దిశెట్టి వేణుగోపాల్ లాంటివారే కాకుండా మరికొంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నార‌ని, పార్టీపై ధిక్కార స్వ‌రం వినిపిస్తున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. రెండో విడ‌త‌లో మంత్రి ప‌ద‌వులు ఆశించి అవి ద‌క్క‌నివారు సైతం తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్న‌రాని అంటున్నారు. ఇక త‌న నియోజ‌క‌వ‌ర్గానికి ఎటువంటి నిధులు కేటాయించ‌డంలేదంటూ ఎమ్మెల్యే కోటంరెడ్డి మురుగుకాల్వ డ్రెయినేజీలో కూర్చుకొని నిర‌స‌న వ్య‌క్తం చేయడం పెద్ద చర్చ కు దారి తీసిన సంగతి తెలిసిందే.

ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు సైతం చేసారు. అధికారం ఉంది క‌దా అని ప్ర‌తిప‌క్షాల‌పై దాడుల‌కు దిగితే ఆ త‌ర్వాత వారు మ‌న‌కు బుద్ధిచెబుతార‌ని, అంద‌రినీ సామ‌ర‌స్యంగా క‌లుపుకుపోవాలంటూ కొద్దిరోజుల క్రిత‌మే ఆయ‌న వ్యాఖ్యానించారు. రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డి అయితే ‘ఈనాడు’ దిన‌ప‌త్రిక‌ను పొగుడుతూ, ‘సాక్షి’ దిన‌ప‌త్రిక‌ను విమ‌ర్శిస్తూ వ్యాఖ్య‌లు చేయ‌డమేకాదు.. ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీని అన్యాప‌దేశంగా పొగిడారు. నియోజ‌క‌వ‌ర్గాల‌కు నిధులు విడుద‌ల చేయ‌క‌పోవ‌డంవ‌ల్ల ప్ర‌జ‌ల్లో త‌మ‌మీద వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంద‌నేది ఎమ్మెల్యేలంద‌రి అభిప్రాయంగా ఉంది. మరి ముందుకు ఇంకెంతమంది బయటకు వస్తారో ..ఎన్నికల సమయానికి పక్క పార్టీలోకి ఎంతమంది జంప్ చేస్తారో చూడాలి. ఇక రీసెంట్ గా వైస్సార్సీపీ ఇద్దరు ఎమ్మెల్యే లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసినట్లు తెలుస్తుంది.