భారత్‌తో చర్చలకు మేం సిద్ధం!

Mahmood Qureshi
Mahmood Qureshi

పాకిస్థాన్‌: ముల్తాన్‌లో శనివారం రాత్రి జరిగిన ఇఫ్తార్‌ విందులో పాక్‌ విదేశాంగా మంత్రి మహమూద్‌ ఖురేష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన..భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఏర్పాడిన పరిస్థితలపై చర్చలకు సిద్దంగా ఉన్నట్లు వెల్లడించారు. ఇరు దేశాల మధ్య శాంతి సామరస్యాలు పెంపొందాలంటే చర్చలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఫలితాల్లో ఘన విజయం సాధించిన బిజెపికి పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ అభినందించిన విషయం తెలిసిందే.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/