యుద్ధానికి టిడిపి సిద్ధం

chandrababu naidu, ap cm
chandrababu naidu, ap cm

అమ‌రావ‌తిః ఏపి సియం చంద్ర‌బాబునాయుడు కార్య‌క‌ర్త‌ల‌ను, ఎమ్మెల్యేల‌ను రాబోవు ఎన్నిక‌ల‌కు సంసిద్ధం చేస్తున్నారు.ఎన్నిక‌ల‌కు టిడీపీ సిద్ధంగా ఉంద‌ని, మనం అందరం పరుగు పందెంలో ఉన్నామ‌ని, అభ్యర్థుల ఎంపిక పూర్తి కావొచ్చింద‌ని అన్నారు. వాస్తవాలకు దగ్గరగా అభ్యర్ధుల ఎంపిక చేశాం. అన్ని స్థానాల్లో గెలిస్తే పరిపాలన సులభతరం అవుతుంది. 25 ఎంపీ, 150 పైగా అసెంబ్లీ స్థానంలో టీడీపీ గెలిచేలా కృషిచేయాలని చం్ర‌ద‌బాబు పార్టీలోని ప్ర‌తి ఒక్క‌రికి సూచించారు. ఈ విష‌యాన్ని ఏపి సియం త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు.

తాజా ఆంధ్ర‌ప్ర‌దేశ్ వార్త‌ల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/