నిమిషాల్లో వంట రెడీ!

వంటింటి చిట్కాలు

Kitchen Tips
Kitchen Tips

ప్రస్తుతం వంటపనంతా మెషిన్‌పై చేయడం అల వాటు చేసుకుంటున్నారు చాలా మంది. స్విచ్‌ ఆన్‌ చేసుకుంటే చాలు వేళకు అటూ ఇటూ కాకుండా రుచులను సిద్ధం చేసేస్తుంటాయి మెషిన్స్‌.

అందుకే వీటికి డిమాండ్‌ ఎక్కువ. ఈ చిత్రాన్ని చూడండి. ఇందులో ఎలాంటి ఆహారాన్నైనా నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు.

అందుకు అనువైన అత్యాధునిక టెక్నాలజీ ఈ మేకర్‌ సొంతం. ఇందులో బియ్యానీ, పాస్తా వంటి వెరైటీలతో పాటూ చిప్స్‌, పిజ్జా వంటి వెరైటీలు ఎన్నో సిద్ధం చేసుకోవచ్చు.

ఇందులో చికెన్‌, మట్‌, ఫిష్‌ వంటి నాన్‌వెజ్‌ ఐటమ్స్‌ గ్రిల్‌ చేసుకోవడంతో ఆపటూ కూరగాయలు, ఆకుకూరలు, జొన్నకండెలు, చిలగడ దుంపలు ఇలా చాలానే వేయించుకోవచ్చు.

ఇది స్విచ్‌ ఆన్‌ చేయగానే పైన మూతకు అటాచ్‌ అయి ఉన్న ఫ్యాన్‌ గిర్రున తిరుగుతూ మెషిన్‌ లోపలంతా వేడిగాలిని ప్రసరిస్తుంది.

ఇక అడుగున ఉన్న హీటర్‌ వేడితో పాటూ ఐన వచ్చే హీట్‌ తోడై ఇందులోని ఆహారం వేగంగా ఉడుకుతుంది.

పైగా ఇందులో ఆహారం తిప్పుతూ ఉండేందుకు గరిటెలాంటి పరికరం పాన్‌కి అటాచయి ఉంటుంది. దాంతో సాధారణమైన ఓవెన్స్‌ కంటే ఇది చాలా వేగవంతంగా పనిచేస్తుంది.

ఇలాంటి మల్టీమేకర్స్‌ మరిన్ని సౌకర్యాలతో మార్కెట్‌లో లభిస్తున్నాయి.

ఉదయం నుంచి సాయంత్రం వరకు వంటగదిలో అన్ని హంగులు, వంటకు కావల్సిన అన్ని సరకులు ఉండటంతోపాటు ఇలాంటి ఓ మెషిన్‌ వంటగదిలో ఉండాల్సిందే.

అప్పుడు రుచుల పంట సొంతమవుతుంది. ఎలా అంటే? దీన్ని అవసరాన్నిబట్టి, మేకర్‌ మధ్యలో ఒక ప్రత్యేకమైన ట్రేని అడ్డుగా పెట్టుకుని, రెండు భాగాలుగా చేసుకోవచ్చు.

ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌ కోసం, బోండా, బజ్జీ, పూరీ ఇలా చాలానే సిద్ధం చేసుకోవచ్చు. మధ్యా హ్నం పప్పు, పప్పుచారులోకి నంజుకోవ డానికి చిప్స్‌, వడి యాలు వంటివి చేసుకోవచ్చు.

సాయంత్రం స్నాక్స్‌ కోసం సింపుల్‌గా, తక్కువ పరిమా ణంలో నూనెలో వేయించే జంతి కలు, మురుకులు, గవ్వలు ఇలా చాలా పిండి వంటలను తయారు చేసుకోవచ్చు.

భోజనంలోకి నూర రించే విధంగా చికెన్‌, మటన్‌, రొయ్యలు చేసుకునేం దుకు ఉపయోగపడుతుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం :https://www.vaartha.com/telangana/