హైదరాబాద్ సిటీని మెచ్చుకున్న మోడీ..

మొత్తానికి హైదరాబాద్ సిటీ ని ప్రధాని మోడీ మెచ్చుకోక తప్పలేదు. బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా ప్రధాని మోడీ హైదరాబాద్ కు చేరుకున్నారు. చాలఏళ్ల తర్వాత జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగబోతుండడంతో బిజెపి అగ్ర నేతలు , ఇతర రాష్ట్రాల బిజెపి ముఖ్యమంత్రులు ఇలా అంత హైదరాబాద్ లో ఉన్నారు. డైనమిక్‌ సిటీ హైదరాబాద్‌కు చేరుకున్నానని ప్రధానమంత్రి మోడీ ట్వీట్ చేసారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డాక హైద‌రాబాద్ నగరం ఏ రేంజ్ లో అభివృద్ధిలో ప‌రుగులు పెడుతుందో చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణ ప్ర‌భుత్వం ఒక‌వైపు మౌలిక స‌దుపాయాల‌ను మెరుగుప‌రుస్తూ.. మ‌రో వైపు విదేశీ పెట్టుబడులను ఆక‌ర్షిస్తోంది. న‌గ‌రాన్ని ప‌ర్యాట‌కంగా కూడా అభివృద్ధి చేస్తోంది. అలా భాగ్య‌న‌గ‌రం విశ్వ‌న‌గ‌రంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పుడు ఇదే విష‌యాన్ని సాక్షాత్తు ప్రధాని మోడీ సైతం ఒప్పుకున్నారు. జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల్లో పాల్గొనేందుకు హైద‌రాబాద్ వ‌చ్చిన మోదీ.. ఈ విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పారు. ఈ మేరకు మోడీ తెలుగులో ట్వీట్‌ చేశారు. డైనమిక్‌ సిటీ హైదరాబాద్‌కు చేరుకున్నానని మోడీ ట్వీట్ చేసారు.

హెచ్‌ఐసీసీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 18 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశాలు ప్రారంభించారు. ప్రధాని మోదీ, అమిత్‌ షా, బీజేపీ జాతీయ నేతలు పాల్గొన్నారు. రెండు రోజులపాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. రేపు కూడా మోదీ హైదరాబాదర్‌లోనే ఉండనున్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మోదీ పాల్గొంటారు. సాయంత్రం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో మోదీ బహిరంగసభలో పాల్గొంటారు.