దిశ నిందితుల మృతదేహాలకు ముగిసిన రీపోస్టుమార్టం

Disha case accused
Disha case accused

హైదరాబాద్‌: దిశ నిందితుల మృతదేహాలకు జరిగిన రీపోస్టుమార్టం ముగిసింది. కాగా దిశ నిందితుల మృతదేహాలకు ఎయిమ్స్‌ బృందం నేడు గాంధీ ఆస్పత్రిలో రీపోస్టుమార్టం నిర్వహించిన విషయం తెలిసిందే. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై పిటిషన్‌ దాఖలైన నేపథ్యంలో రీపోస్టుమార్టం నిర్వహించారు. అయితే అంతకు ముందు మృతదేహాలకు ఎక్స్‌రే తీశారు. ఈ పోస్టుమార్టం జరిగిన తీరును మొత్తం వీడియోలో చిత్రీకరించారు వైద్యులు. నివేదిక వివరాలను సీల్డ్‌ కవర్‌లో ఉంచి సాయంత్రం కల్లా హైకోర్టుకు సమర్పించనున్నారు. అంతేకాకుండా వారి మృతదేహాలను మరికాసేపట్లో కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఈ మృతదేహాలను వారి గ్రామాలకు తరలించేందుకు రెండు అంబులెన్సులను అధికారులు ఏర్పాటు చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/