జెడియు అధ్యక్షునిగా ఆర్‌సిపి సింగ్‌ ఎన్నిక

బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ సన్నిహితుడు

RCP Singh as JDU President
RCP Singh as JDU President


లక్నో: బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ సన్నిహితుడు రాంచంద్ర ప్రసాద్‌సింగ్‌ జనతా దళ్‌ యునైటెడ్‌ (జెడియు) అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆయన ఆర్‌సిపి సింగ్‌గా ప్రసిద్ధులు.

లక్నోలో జరిగిన నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ మీటింగ్‌లో ఇప్పటివరకు అధ్యక్షునిగా వ్యవ హరించిన నితీష్‌కుమార్‌ పదవి నుంచి తప్పుకుని, ఆర్‌సిపి సింగ్‌ పేరును ఆ పదవికి ప్రతిపాదించారు.

ఆయన ప్రతి పాదనను ఏకగ్రీవంగా మిగిలిన సభ్యులు ఆమోదించా రని జెడియు సీనియర్‌ నాయకుడు ఒకరు తెలియచేశారు.

నితీష్‌కుమార్‌ 2019లో తిరిగి జెడియు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. మరో రెండేళ్లు ఆయన పదవీకాలం ఉండగానే రాజ్య సభలో తమ పార్టీకి నాయకత్వం వహిస్తున్న ఆర్‌సిపి సింగ్‌ పేరును ప్రతిపాదించారు.

ఇప్పటివరకు సింగ్‌ జెడియుకి జనరల్‌ సెక్రెటరీగా ఉన్నారు. దేశంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు జెడియు నేషనల్‌ ఎక్జిక్యూటివ్‌ మీటింగ్‌ జరిగింది. ఇటీవల ఈశాన్య భారతంలో తమ ఏడుగురు ఎమ్మెల్యేల్లో ఆరుగురు బిజెపిలో చేరడంతో ఈ సమావేశాన్ని నిర్వహించారు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/