తొలిసారిగా ఐపిఎల్‌లో మహిళకు చోటు

IPL
IPL

బెంగుళూర్‌: ఐపిఎల్‌ చరిత్రలో జట్టు సహాయక బృందంలో మొదటిసారిగా ఓ మహిళకు చోటు ఇచ్చారు. ఇలా మహిళకు అవకాశం ఇవ్వడం ఇదేమొదటిసారి. ఆర్సీబీ జట్టు తమ అధికారిక ట్విట్టర్‌లో గురువారం రాత్రి విషయాన్ని వెల్లడించింది. ఐపీఎల్‌ 13వ సీజన్‌ నవ్‌నీతా గౌతమ్‌ అనే మాసీజ్‌ థేరపిస్టు నియమించుకున్నామని, ఆటగాళ్లకు అవసరమైన ఫిజియో సంబంధిత అంశాలను పర్యవేక్షిస్తారని తెలిపింది. ప్రధాన ఫిజియో థెరపిస్టు ఇవాన్‌ స్పీచ్లీ నేతృత్వంలో నవనీతా సహాయకురాలిగా కొనసాగనుంది. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ కోసం ప్రత్యేక ఎక్సర్‌సైజ్‌లు, నైపుణ్య సాధనాలు చేయించడం, మోటివేషన్‌ కలిగించడం ఆమె పని. ఆటల్లో మహిళల ప్రధాన్యం గుర్తించి సహయక బృందాల్లోనూ వారికి అవకాశమివ్వడం అతి ముఖ్యమన్నారు. అన్ని క్రీడల్లో మహిళల భాగస్వామ్యం వల్ల విజయాలు రావడం వలన ఈ ఎంపిక ప్రాధన్యత సంతరించుకుంది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/sports/