రెపో రేటు 25 బేసిస్‌ పాయింట్లు పెంపుదల

RBI
RBI

రెపో రేటు 25 బేసిస్‌ పాయింట్లు పెంపుదల

ముంబయి,: ఆర్‌బిఐ నాలు గళ్లలో మొదటిసారిగా రెపోరేట్లను 6.25 శాతానికి పెంచడంతో గృహరు ణాల ఇఎంఐలు పెరిగే అవకాశం ఉంది. అయితే పొదుపుచేసే డిపాజిటర్లకు మాత్రం కొంత శుభవార్త చెప్పి నట్లేనని అంచనా. బుధవారం తన ద్వైమాసిక ద్రవ్యవిధాన పర పరతిసమీక్షలో రిజర్వు బ్యాంకు ఇప్పటి వరకూ ఆరుశాతం వద్దనే ఉన్న రెపో రేట్లను 25బేసిస్‌ పాయింట్లుపెంచి 6.25శాతానికి పెంచింది. అలాగే రిజర్వుబ్యాంకు బ్యాంకులనుంచి తీసుకునే స్వల్పకాలిక రుణాలపై రివర్స్‌రెపోరేట్‌ను 6శాతం వద్దనే ఉంచింది. జిడిపి వృద్ధి ఈ ఆర్ధికసం వత్సరంలో 7.4శాతంగా ఉంటుందని సైతం అంచనావేసింది. ఇక మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిలిటీ(ఎంఎస్‌ఎఫ్‌) బ్యాంక్‌రేట్‌లను 6.50శాతంగా ఉంచింది. దీనివల్ల గృహరుణాల వాయిదాలు కొంతమేర పెరుగుతాయని నిపుణులు అంచనావేస్తున్నారు. గృహరుణాలతోపాటు, ఆటో, ఇతర రుణాల వడ్డీరేట్లు పెరుగుతాయి ఫలితంగా వాయిదాలుసైతం పెరుగుతాయని అంచనా. ఆరుగురు సభ్యు లున్న మానిటరీపాలసీ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా వడ్డీరేట ్లపెంపునకు మద్దతిచ్చాఉరు. 2014 జనవరి 28వ తేదీ తర్వాత వడ్డీరేట్లు మొదటిసారిగా పెరిగి 8శాతానికి వచ్చాయి. ఆ తర్వాత ఆర్‌బిఐ వడ్డీరేట్లను ఆరు సందర్భాల్లో తగ్గించింది. గత సమావేశంలోనే 25 బేసిక్‌ పాయింట్లు తగ్గించి ఆరుశాతానికి చేర్చింది.