డిపాజిటర్ల సొమ్ము భద్రం: ఆర్‌బీఐ గవర్నర్‌

యస్‌ బ్యాంకు కస్టమర్లకు ఎలాంటి ఆందోళన అవసరం లేదు

shaktikanta das
shaktikanta das

ముంబయి: యస్‌ బ్యాంకు సంక్షోభం, డిపాజిట్‌దారుల ఆందోళన నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ స్పందించారు. ఆర్థిక వ్యవస్థ భద్రతే లక్ష్యంగా యస్‌ బ్యాంక్‌ ఆంక్షల నిర్ణయం చాలా పెద్ద స్థాయిలో తీసుకున్నామనీ, వ్యక్తిగత సంస్థ స్థాయిలో కాదని ఆర్‌బీఐ గవర్నర్‌ వివరించారు. అతి తొందరలోనే నెలరోజుల గడువు లోపే యస్‌బ్యాంక్‌ పునరుద్ధరణకు ఒక పథకాన్ని అమలు చేయనున్నామని చెప్పారు. యస్‌ బ్యాంక్‌ కస్టమర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి సొమ్ము భద్రంగా ఉంటుందని హామీ ఇచ్చారు. డిపాజిట్‌ భద్రత కోసం ఆర్‌బీఐ తాజా నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. మరోవైపు ఆర్‌బీఐ సరియైన నిర్ణయం తీసుకుందని ప్రధాన ఆర్థిక సలహాదారు కె. సుబ్రమణియన్‌ వ్యాఖ్యానించారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడంలో కేంద్ర, ఆర్‌బీఐ కృషిచేస్తోందన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/