ఆర్‌బిఐ రెపోరేట్‌కట్‌ అనివార్యం!

అంతర్జాతీయ ఆర్ధికవేత్తల విశ్లేషణ

RBI
RBI

ముంబయి: పదేళ్ల ప్రభుత్వ బాండ్లు వరుసగా మూడోరోజుసైతం క్షీణించాయి. నెలరోజుల కనిష్టస్థాయికి చేరాయి. మధ్యాహ్నం సమయానికి పదేళ్ల బాండ్ల రాబడులు ఆరుబేసిస్‌పాయింట్లు తగ్గి 6.609శాతంగా నిలిచింది. ఈ స్థాయి గతనెల తొమ్మిదో తేదీ నమోదయింది. మంగళవారం బాండ్ల రాబడులు 6.664 శాతంవద్ద నిలిచాయి. భారతీయ ఆర్ధికరంగ మార్కెట్లు బుధవారం గాంధీజయంతి సందర్భంగ ఆమూతపడ్డాయి. ఆర్‌బిఐ తన ద్వైమాసిక నివేదికను శుక్రవారం వెలువరించనున్న నేపథ్యంలో కొంతమేర వడ్డీరేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు హోత్తుతున్నాయి. మరో 25 బేసిస్‌ పాయింట్లు వడ్డీరేట్లు తగ్గించి 5.15శాతంగా నిర్ణయిస్తుందని ఆర్ధికవేత్తల సర్వేలు చెపుతున్నాయి. ఆర్ధికరంగపరంగా కొంతమేర దిగువకు రావడం, కార్పొరేట్‌ పన్ను తగ్గింపు వంటివిరుణపరపతిని ఏమాత్రం కదిలించలేదు. కేర్‌రేటింగ్స్‌ మరో రేట్‌కట్‌ ఉంటుందన్న అంచనాలను వెల్లడించింది. ఆర్ధికవృద్ధి మందగించడం, విదేశీ పెట్టుబడులు క్షీణించడం వంటి వాటి నేపథ్యంలో ఇపుడు ఆర్‌బిఐ రెపో కట్‌ కీలకం అయింది. దేశంలోని ఆర్థిక వాతావరణం నాలుగోత్రైమాసికానికికానీ స్ఫష్టం కాదన్న అంచనాలున్నాయి.

పన్ను రాబడులపరంగా పెట్టుబుల ఉపసంహరణను కూడా పెంచుకోవాల్సివచ్చింది. ఆర్‌బిఐ డివిడెండ్‌ పేఔట్‌, సబ్సిడీలు వంటివాటి పరిస్థితిపై చూస్తే మరికొంత రావాల్సి ఉంటుంది. ఇక వ్యయాన్ని కూడా తగ్గించుకోవాల్సి ఉంటుందని అంతర్జాతీయ బ్యాంకులు, ఇన్వెస్టర్‌రేటింగ్‌ సంస్థలు అంచనావేస్తున్నాయి. ప్రాథమికంగాచూస్తే ఆర్ధికలోటు జిడిపిలో 3.5నుంచి 3.6శాతంగా ఉంటుందని అంచనా. బడ్జెట్‌లో మాత్రం ఆర్థికలోటు 3.3శాతంగా మాత్రమే ఉంటుందని అంచనా. ఇక భారత రూపాయ నష్టాలనుంచి కొంతకోలుకుంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే దేశీయ కరెన్సీ క్షీణించి రెండువారాల కనిష్టానికి చేరింది. 12.50 గంటలసమయానికి 71.35రూపాయలుగా నిలిచింది. డాలర్‌తో పోలిస్తే 71.08గా నిలిచింది. ఈ ఏడాది ఇప్పటివరకూ రూపాయి 1.8శాతం క్షీణించింది. విదేశీ ఇన్వెస్టర్లు సుమారు 8.16 బిలియన్‌ డాలర్లమేరభారతీయ ఇవ్వటీల్లోను, డెట్‌రంగంలో 3.97 బిలియన్‌ డాలర్లమేర పెట్టుబడులుపెట్టారు.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/business/