ఐడిబిఐ పేరు మార్పుకు ఆర్‌బిఐ !

న్యూఢిల్లీ, : ఐడిబిఐలో ఎల్‌ఐసి 51 శాతం కొనుగోలు చేసిన తర్వాత పేరును బ్యాంకు మార్చాలని ఎల్‌ఐసి భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎల్‌ఐసి ఐడిబిఐ బ్యాంకు లిమిటెడ్‌ గానీ, ఎల్‌ఐసి బ్యాంకు లిమిటెడ్‌గా పెట్టాలని అనుకుంది. ఇందుకోసం పేరు మార్పిడి ప్రతిపాదనను చేశాయి. అయితే పేరు మార్పిడికి రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఒప్పుకోదని తెలుస్తోంది. అయితే పేరు మార్పిడి కోసం ఆర్‌బిఐతో పాటు కార్పొరేట్‌ వ్యవహరాల మంత్రిత్వశాఖ, షేరు హోల్డింగ్స్‌, స్టాక్‌ ఎక్ఛేంజ్‌ నుంచి కూడా క్లియరెన్స్‌ రావాలి. ఎల్‌ఐసి మేజర్‌ షేరు కొనుగోలు చేసిన తర్వాత ఐడిబిఐని ప్రైవేట్‌ బ్యాంకుగా పరిగణించనున్నట్లు రిజర్వ్‌ బ్యాంకు ఇటీవలే ప్రకటించింది. గత ఏడాదిలోనే ఐడిబిఐ వాటాలను కొనుగోలు చేసిన ఎల్‌ఐసి ప్రమోటర్‌గా మారింది.

https://www.vaartha.com/news/business/
మరిన్ని తాజా బిజినెస్‌ తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.