దేశ వ్యాప్తంగా అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి

ఉపాధి, ఇతర రంగాలపై కరోనా వైరస్‌ తీవ్ర ప్రభావం చూపింది

YouTube video
Keynote address by RBI Governor in 7th SBI Banking and Economics Conclave

న్యూఢిల్లీ: భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఈరోజు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) బ్యాంకింగ్‌, ఎకనమిక్స్‌ కాన్‌క్లేవ్‌లో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈసందర్భగా ఆయన మాట్లాడుతూ..కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా దేశ వ్యాప్తంగా అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, వందేళ్లలో ఎన్నడూ లేని సంక్షోభ పరిస్థితులు తలెత్తాయని అన్నారు. దేశంలో ఆర్థిక స్థిరత్వానికి అనేక చర్యలు చేపట్టామని శక్తికాంత దాస్ వివరించారు. ఉపాధి, ఇతర రంగాలపై కరోనా వైరస్‌ తీవ్ర ప్రభావం చూపిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆర్థిక వృద్ధి, స్థిరత్వానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. కరోనా వల్ల తలెత్తే అవకాశమున్న సంక్షోభాలను గుర్తించి అవి రాకుండా చేయడానికి ప్రణాళికలు వేసుకుంటున్నట్లు చెప్పారు. అన్ని సంప్రదాయ, అసాధారణ చర్యలు తీసుకుంటూ మార్కెట్‌ తిరిగి పుంజుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/