వడ్డీరేట్లు తగ్గించిన ఆర్‌బిఐ

RBI
RBI


న్యూఢిల్లీ: ఆర్‌బిఐ ఈ రోజు 2019-2020 ఆర్ధిక సంవత్సరానికి గాను రెపోరేటును తగ్గించింది. రెపోరేటును 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం రెపోరేటు 6.25 శాతం ఉండగా తాజాగా తీసుకున్న నిర్ణయంతో 6 శాతానికి వచ్చింది. మిగిలిన అంశాలు యథాతథంగా కొనసాగించాలని మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయించింది. ప్రస్తుత నిర్ణయంతో బ్యాంకులకు చౌకగా రుణాలు లభ్యమవుతాయి. దీంతో రివర్స్‌ రెపో రేటు 5.75 శాతంగా ఉండనుంది. బ్యాంకు రేటు 6.25 శాతానికి చేరింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/andhra-pradesh-election-news-2019/