కీలక వడ్డీరేట్లను తగ్గించిన ఆర్బీఐ


రేపోరేట్ పావుశాతం తగ్గింపు

rbi governor shaktikanta das
rbi governor shaktikanta das

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రెపో రేట్ తగ్గించిన నేపథ్యంలో లోన్లు తక్కువ వడ్డీతో లభ్యం కానున్నాయి. ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన జరిగిన పరపతి విధాన కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడున్న 5.40 శాతం రెపో రేటును పావు శాతం తగ్గించారు. తద్వారా కొత్త వడ్డీరేటు 5.15 శాతం అయింది. వీటితోపాటు రివర్స్ రెపో (4.90), బ్యాంకు రేట్ల(5.40)ను కూడా సవరిస్తూ తాజా నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో వృద్ధిరేటు తిరిగి పుంజుకోవడానికి తమ నిర్ణయాలు తోడ్పడతాయని భావిస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఇటీవల ఆర్బీఐ రెపో రేటును తగ్గించడం ఇది వరుసగా ఐదో సారి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/