ఎస్‌బ్యాంకు బోర్డులో ఆర్‌బిఐ ప్రతినిధి

ఎస్‌బ్యాంకు బోర్డులో ఆర్‌బిఐ ప్రతినిధి

ముంబయి: ప్రైవేటురంగంలోని ఎస్‌బ్యాంకు డైరెక్టర్ల బోర్డులో ఆర్‌బిఐ మాజీ డిప్యూటి గవర్నర్‌ ఆర్‌.గాంధీని నియమించింది. యెస్‌బ్యాంకు షేర్లు సుమారు నాలుగుశాతానికిపైగా క్షీణించాయి. అదనపు డైరెక్టర్‌గా ఆర్‌.గాంధీ వ్యవహరిస్తారు. ఆర్‌బిఐకి ఉన్న బ్యాంకింగ్‌ క్రమబద్దీకరణ చట్టం 1949 ప్రకారం ఆర్‌.గాంధీని అదనపు డైరెక్టర్‌గా రెండేళ కాలం పాటుకొనసాగేవిధంగా నియమిస్తూ తాజాగా ఉత్తర్వులుజారీచేసింది. ఆయన నియామకం 14వ తేదీనుంచే అమలులోనికి వస్తుందని, 2021 మే 13వ తేదీవరకూ అమలులో ఉంటుందని ఎస్‌బ్యాంకు స్టాక్‌ ఎక్ఛేంజిలకు నివేదిక ఇచ్చింది. ఈనియామకంతో బ్యాంకుబోర్డు మరింత పటిష్టంగా పనిచేస్తుందని, ఆర్ధికపరిపుష్టికి మరింతగా మార్గనిర్దేశనం చేయగలరని బ్యాంకుయాజమాన్యం ప్రకటించింది. ఆర్‌బిఐకి బ్యాంకుల్లోని బోర్డుల్లో అదనపు డైరెక్టర్లను నియమించే అధికారాలున్నాయి. బ్యాంకింగ్‌ శ్రేయస్సు, డిపాజిటర్ల శ్రేయస్సును పరిగణనలోనికి తీసుకుని బ్యాంకులో రిజర్వుబ్యాంకుప్రతినిధులను నియమిస్తుంది. బ్యాంకు 1507 కోట్ల నష్టం నాలుగోత్రైమాసికంలో ప్రకటించడంతో వెనువెంటనే రిజర్వుబ్యాంకు ఈచర్యలు చేపట్టింది. బుధవారం బ్యాంకు షేర్లుసైతం నాలుగుశాతం క్షీణించాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/