రూ.2000 నోట్ల మార్పిడి .. బ్యాంకులకు ఆర్బీఐ సలహా

RBI advises banks to continue exchange of ₹2000 …

న్యూఢిల్లీః రూ. 2 వేల నోట్లను భారతీయ రిజర్వ్ బ్యాంకు ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. 2023 మే 23 మంగళవారం నుంచి బ్యాంకులతో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ. 2 వేల నోట్లను మార్చుకునే అవకాశాన్ని కలిపించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు గైడ్ లైన్స్ విడుదల చేసింది నోట్లను మార్చుకునేందుకు సాధారణ పద్ధతిలోనే ప్రజలకు అందించాలని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. ఇందుకు సంబంధించి ప్రాఫార్మాను విడుదల చేసింది. బ్యాంకులు వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రింకింగ్ వాటర్ సదుపాయాన్ని కల్పించాలని సూచించింది.

మరోవైపు రెండు వేల నోటును ప్రవేశపెట్టిన లక్ష్యం నెరవేరిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అన్నారు. దేశంలో రెండు వేల నోటు సర్క్యులేషన్ గణనీయంగా తగ్గిందని చెప్పారు. టాక్స్ కట్టిని వారిపై ఈడీ, సీబీఐ నిఘా ఉంటుదని తెలిపారు.