రాయల చెరువు ఏ క్షణమైనా తెగిపోనుందా..?

రాయలచెరువు ఏ క్షణమైనా తెగిపోయే అవకాశం ఉండడం గ్రామస్థులు భయాందోళనలో ఉన్నారు. అనుపల్లి నుంచి వరద ప్రవాహం ఎక్కువగా రావడం.. తూముల ద్వారా అవుట్ ఫ్లో తక్కువగా ఉండ‌డంతో రాయల చెరువు నిండుకుండలా మారింది. గత నాల్గు రోజులుగా చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండడం తో అన్ని చెరువులు , కుంట లు , వాగులు నిండిపోయాయి. కొన్ని చోట్ల చెరువులు తెగిపోయి గ్రామాల్లోకి నీరు చేరాయి.

ఈ క్రమంలో రాయలచెరువు పూర్తి స్థాయిలో నిండి దాని చుట్టుప‌క్క‌ల గ్రామాల‌న్నీ నీట మునిగాయి. చెరువు స‌మీపంలోని సీకే పల్లి, రాయల్ చెరువుపేట, సూరావారి పల్లి, గొల్లపల్లి గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.. ప్రజలు ఎవరు బయటకు రావొద్ద‌ని అధికారులు హెచ్చరికలు చేశారు. రాయల చెరువు ఈ స్థాయిలో వరద ప్రవాహం ఉండడం, పూర్తిగా నిండిపోవడం కొన్ని సంవత్సరాల తర్వాత జరిగిందంటున్నారు అక్కడి గ్రామాల వాసులు. రాయల్ చెరువులో ఉన్న నీటిని త్వరితగతిన బయటకు వెళ్లేవిధంగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.