ప్రమాద స్థాయిలో రాయల్ చెరువు..భయం గుప్పిట్లో 20 గ్రామాలు

చిత్తూరు జిల్లాలో రాయల్ చెరువు ప్రమాద స్థాయిలో ఉంది. ఎక్కడ కట్ట తెగిపోతుందో అని 20 ముంపు గ్రామాలు భయం గుప్పింట్లో ఉన్నారు. వరద ప్రవాహానికి చెరువు కట్ట నుంచి మట్టి జారిపోతుండటంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు సమీపంలోని గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు. 18 గ్రామాల ప్రజలను పద్మావతి నిలయానికి తరలించారు. ముందు జాగ్రత్తలో భాగంగా హెలికాఫ్టర్లను అందుబాటులో ఉంచామని అధికారులు చెబుతున్నారు.

రాయల చెరువు తూముల నుంచి భారీగా వరద దిగువకు చేరుతోంది. మళ్లీ వర్షం రాకపోతే ప్రమాదం ఉండదని అధికారులు తెలిపారు. రామాపురం దగ్గర 6 అంబులెన్స్‌లను సిద్ధం చేశారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు చెరువు కట్ట దగ్గరకు చేరుకున్నాయి. ఈ చెరువుకు 0.9 టీఎంసీల నీరు చేరిందని గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో వరద ప్రవాహం రాలేదని అధికారులు చెపుతున్నారు.