రవితేజ కోసం పోటీ పడుతున్న సంక్రాంతి గెలుపు గుర్రాలు

క్రాక్ తర్వాత సరైన హిట్ లేని మాస్ రవితేజ ..ఇప్పుడు రెండు బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ హిట్స్ కొట్టి మళ్లీ వార్తల్లో నిలిచాడు. గత నెలలో ధమాకా తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాదు రూ. 100 కోట్ల క్లబ్ లో చేరాడు రవితేజ. ఆ వెంటనే మెగాస్టార్ చిరంజీవి తో కలిసి వాల్తేర్ వీరయ్య అంటూ సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ వారం రోజుల్లోనే రూ. 150 కోట్ల క్లబ్ లో చేరింది. ఇలా రెండు హిట్స్ తో మళ్లీ ముందువరుసలోకి వచ్చాడు రవితేజ.

ప్రస్తుతం రవితేజ రావణాసుర , టైగర్ నాగేశ్వర్ రావు సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు కూడా పాన్ ఇండియా మూవీస్ కావడం విశేషం. ఈ రెండు చిత్రాల తర్వాత ఎవరితో చేస్తాడనే దానిగురించి అంత మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఫిలిం సర్కిల్లో వినిపిస్తున్న సమాచారం మేరకు రవితేజ తో సినిమాలు చేసేందుకు సంక్రాంతి విజేతలు బాబీ , గోపీచంద్ మలినేని పోటీపడుతున్నారు. బాబీ ఇప్పటికే రవితేజ కోసం ఓ కథ సిద్ధం చేసాడట. దానిని రవితేజ కు వినిపించడం కూడా జరిగిందని అంటున్నారు. అలాగే వీర సింహ రెడ్డి డైరెక్టర్ గోపీచంద్ క్రాక్ సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నాడట. ఈ నేపధ్యంలో ఈ ఇద్దరి దర్శకులతో రవితేజ ప్రాజెక్ట్స్ అయితే కచ్చితంగా ఉంటాయనేది టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తుంది. అయితే వీరిలో ఎవరితో ముందుగా సినిమా చేస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.