డ్రగ్స్ కేసు : ముగిసిన రవితేజ ఈడీ విచారణ

డ్రగ్స్ కొనుగోళ్లు… మనీ లాండరింగ్ కేసులో ఈరోజు రవితేజ ను ఈడీ అధికారులు విచారించారు. ఉదయం 10 గంటలకు ఈడీ ఆఫీస్ కు చేరుకున్న రవితేజ ను దాదాపు 6 గంటల పాటు ప్రశ్నించారు. రవితేజ తో పాటు ఆయన డ్రైవర్‌ శ్రీనివాస్‌ ను సైతం ఈరోజు విచారించడం జరిగింది. రవితేజ నుండి అనేక సమాదానాలు రాబట్టి ఆయన్ను పంపించారు. విచారణ ముగియగానే… మీడియా కంట పడకుండా… రవి తేజ తన కారులో ఎక్కి… మళ్లీ గెస్ట్‌ హౌజ్‌ కు వెళ్లారు.

ఈ కేసులో చిత్రసీమలో 12 మందికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆ 12 మంది ని ఈడీ అధికారులు విచారించడం మొదలుపెట్టారు. ఇప్పటికే వరకు డైరెక్టర్ పూరి జగన్నాధ్ , ఛార్మి , రకుల్ , నందులను విచారించిన అధికారులు..నిన్న రానా ను విచారించడం జరిగింది. బుధువారం రానా ను ఈడీ అధికారులు దాదాపు 7 గంటలకు పైగా ప్రశ్నించారు. రానాతో పాటు డ్రగ్ పెడలర్ కెల్విన్‌ను కూడా ఈడీ అధికారులు విచారించారు. ముఖ్యంగా రానా-కెల్విన్ మధ్య సంబంధాలపై అధికారులు కూపీ లాగినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కొనుగోలు కోసం వీళ్లిద్దరి మధ్య ఏమైనా మనీ ట్రాన్సాక్షన్స్ జరిగాయా? అన్న విషయంపై ఆరా తీశారు. రానా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి 2015 నుంచి 2017 వరకు బ్యాంకు స్టేట్‌మెంట్స్‌ను అధికారులు సేకరించారు.