రవితేజ కు అలాంటి ఆడవాళ్లు అంటే చాల ఇష్టమట

ధమాకా , వాల్తేర్ వీరయ్య చిత్రాలతో మెగా హిట్స్ అందుకున్న మాస్ రాజా రవితేజ..ప్రస్తుతం రావణాసుర మూవీ తో ఏప్రిల్ 07 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ డైరెక్షన్లో.. నావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లో రవితేజ సరసన ఏకంగా 5 గురు హీరోయిన్లు నటిస్తున్నారు. అనూ ఇమ్మాన్యూయేల్, మేఘా ఆకాష్, ఫరీయా అబ్దుల్లా, దీక్షా నగార్కర్, పూజిత పొన్నాడ నటించారు. అభిషేక్ నామా నిర్మించిన ఈ సినిమాకి రవితేజ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ – భీమ్స్ సంగీత దర్శకులుగా వ్యవహరించారు.

ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడం తో రవితేజ వరుసగా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ గా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ…ఆడవాళ్ల ఫై ఆసక్తికర కామెంట్స్ చేసారు. ఏదైనా మొహం మీదే చెప్పేసే ఆడవాళ్లు.. ముఖ్యంగా పొగరు కలిగిన ఆడవాళ్లు బాగా నచ్చుతారు. ఆడవాళ్లకు పొగరు ఉంటేనే బాగుంటుంది ఒకరిపై ఆధారపడకుండా.. ఎవరూ లేకపోయినా నేను ఉండగలను.. అనే ఆత్మస్థైర్యం కలిగిన వాళ్లు అంటే.. నాకు ఇష్టం అని తెలిపాడు. దీంతో రవితేజ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి.