డ్రగ్స్ కేసు : రవితేజ ను విచారిస్తున్న ఈడీ అధికారులు

డ్రగ్స్ కేసు : రవితేజ ను విచారిస్తున్న ఈడీ అధికారులు

డ్రగ్స్ కొనుగోళ్లు… మనీ లాండరింగ్ కేసుల నేపథ్యంలో నోటీసులు అందుకున్న రవితేజ..ఈడీ ఆఫీస్ కు చేరుకున్నారు. ఈ కేసులో చిత్రసీమలో 12 మందికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆ 12 మంది ని ఈడీ అధికారులు విచారించడం మొదలుపెట్టారు. ఇప్పటికే వరకు డైరెక్టర్ పూరి జగన్నాధ్ , ఛార్మి , రకుల్ , నందులను విచారించిన అధికారులు..నిన్న రానా ను విచారించడం జరిగింది. ఈరోజు మాస్ మాహరాజాపై ప్రశ్నలను సంధించేందుకు ఈడీ సర్వం సిద్ధం చేసుకుంది. ఇందులో కెల్విన్‏కు, రవితేజాకు మధ్య ఉన్న సంబంధాలపై ప్రశ్నించే అవకాశముంది. అలాగే డ్రగ్స్ కొనుగోల్ల కోసం లావదేవిలు జరిపారా ? కెల్విన్ ఖాతాకు మనీ ట్రాన్స్‏ఫర్ చేశారా ? ఎప్ క్లబ్‏తో సంబంధాలు ఉన్నాయా ? అనే కోణంలో ఈడీ విచారణ జరపనుంది. అలాగే రవితేజకు సంబంధించిన బ్యాంకు ఖాతాలతోపాటు.. అనుమానాస్పద లావిదేవీలపై కూడా ఈడీ దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది.

ఇక బుధువారం రానా ను ఈడీ అధికారులు దాదాపు 7 గంటలకు పైగా ప్రశ్నించారు. రానాతో పాటు డ్రగ్ పెడలర్ కెల్విన్‌ను కూడా ఈడీ అధికారులు విచారించారు. ముఖ్యంగా రానా-కెల్విన్ మధ్య సంబంధాలపై అధికారులు కూపీ లాగినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కొనుగోలు కోసం వీళ్లిద్దరి మధ్య ఏమైనా మనీ ట్రాన్సాక్షన్స్ జరిగాయా? అన్న విషయంపై ఆరా తీశారు. రానా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి 2015 నుంచి 2017 వరకు బ్యాంకు స్టేట్‌మెంట్స్‌ను అధికారులు సేకరించారు.

దుబాయ్‌లో జరిగిన ఓ ఈవెంట్‌పైన ఈడీ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అందులో రానా, కెల్విన్ మధ్య నగదు లావాదేవీలపైనా ఆరా తీసింది. డ్రగ్స్ కొనుగోలు కోసం రానా ఎవరికైనా డబ్బు పంపించారా? అన్న కోణంలో ఈడీ విచారణ జరిపింది. ఎఫ్ క్లబ్ వ్యవహారాల్లో నవదీప్, రకుల్‌తో ఉన్న సంబంధాలపైనా రానా నుంచి వివరాలు సేకరించారు అధికారులు.