అరుదైన రికార్డుకు చేరువలోజడేజా

Ravindra Jadeja
Ravindra Jadeja


ముంబయి: టీమిండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవీంద్ర జడేజా అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. దిగ్గజ బౌలర్లు కపిల్‌దేవ్‌, మెక్‌గ్రాత్‌ కన్నా ముందుగానే ఆ ఘనతను సాధించేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. వెస్టిండీస్‌తో తొలి టెస్టుకు జడ్డూ సన్నద్ధం అవుతున్నాడు. తుది జట్టులో ఇద్దరు స్పిన్నర్లకు అవకాశం ఉందని తెలుస్తోంది. రవిచంద్రన్‌ అశ్విన్‌కు చోటు ఖాయమే! ఈ నేపథ్యంలో కుల్‌దీప్‌, జడ్డూ మధ్య పోటీ నెలకొంది. చాన్నాళ్లుగా చైనామన్‌ బౌలర్‌ ఫామ్‌లో లేకపోవడం జడ్డూకు కలిసొచ్చే అంశం. ఇప్పటి వరకు 41 టెస్టులు ఆడిన అతడు 192 వికెట్లు తీశాడు. 200కు ఇంకా 8 వికెట్ల దూరంలో నిలిచాడు. తొలి మ్యాచ్‌లో చోటు దక్కితే ఈ సౌరాష్ట్ర స్పిన్నర్‌ రికార్డు సృష్టించే అవకాశం ఉంది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/