మాస్ రాజా ‘రామారావు ఆన్ డ్యూటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్

క్రాక్ మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మాస్ మహారాజ రవితేజ ..ప్రస్తుతం ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు. అతి త్వరలో రమేష్ వర్మ డైరెక్షన్లో చేస్తున్న ఖిలాడీ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. త్రినాద్ రావు దర్శకత్వంలో ధమాకా అనే సినిమా చేస్తున్నారు. అలాగే టైగర్ నాగేశ్వరరావ్ అనే సినిమా కూడా చేస్తున్నారు. వీటితో పాటు శరత్ మాండవ డైరెక్షన్లో రామారావు ఆన్ డ్యూటీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావొస్తుంది. ఈ తరుణంలో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి అభిమానుల్లో ఆనందం నింపారు. మార్చి 25 వ తేదీన థియేట‌ర్ల‌లో రామారావు సినిమాను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఓ పోస్ట‌ర్ విడుద‌ల చేసింది. ఈ ప్రకటన తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఈ చిత్రంలో దివ్యాంకా కౌశిక్, రజిషా విజయన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి, నాజర్, నరేశ్, పవిత్రా లోకేష్, సురేఖా వాణి కీలక పాత్రధారులు. స్యామ్‌ సీఎస్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. సత్యన్ సూర్యన్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు.