రవితేజ కు ఆలా చెప్పుకునేవారిని చూస్తే నవ్వొస్తుందట

ధమాకా , వాల్తేర్ వీరయ్య చిత్రాలతో మెగా హిట్స్ అందుకున్న మాస్ రాజా రవితేజ..ప్రస్తుతం రావణాసుర మూవీ తో ఏప్రిల్ 07 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ డైరెక్షన్లో.. నావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లో రవితేజ సరసన ఏకంగా 5 గురు హీరోయిన్లు నటిస్తున్నారు. అనూ ఇమ్మాన్యూయేల్, మేఘా ఆకాష్, ఫరీయా అబ్దుల్లా, దీక్షా నగార్కర్, పూజిత పొన్నాడ నటించారు. అభిషేక్ నామా నిర్మించిన ఈ సినిమాకి రవితేజ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ – భీమ్స్ సంగీత దర్శకులుగా వ్యవహరించారు.

ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడం తో రవితేజ వరుసగా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ గా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..గతంలో జరిగిన అవమానాలుగానీ .. ఫెయిల్యూర్ లు గానీ .. సక్సెస్ లుగానీ ఇవేమీ నేను పట్టించుకోను .. గుర్తుపెట్టుకోను. ఆ రోజున నన్ను ఇలా అన్నారు అనేసి ప్రతీకారాలు తీర్చుకునే పనులు పెట్టుకోను అని అన్నారు. అలాగే చాలామంది చాలా కష్టాలు పడ్డామని చెప్పుకుంటూ ఉంటారు .. అంతకు మించిన కామెడీ మరొకటి లేదు. ఎవరి కోసం ఎవరు కష్టపడ్డారు? .. ఎదగడం కోసం ఎవరి కష్టాలు వారు పడ్డారు. దానివలన వేరే వాళ్లకి ప్రయోజనం ఏముంటుంది? అందుకే అలా చెప్పుకునేవారిని చూస్తే నాకు నవ్వొస్తూ ఉంటుంది” అని చెప్పుకొచ్చారు.

మరోపక్క రేపు ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో జరగబోతుంది. ఈ ఈవెంట్ కు నాని ముఖ్య అతిధిగా హాజరుకానున్నట్లు వినికిడి.