వాల్తేరు వీరయ్యలో ఏసీపీ విక్రమ్ సాగర్ గా​ రవితేజ

మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. బేబీ డైరెక్షన్లో చిరంజీవి – శృతి హాసన్ జంటగా తెరకెక్కున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13 , 2023 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాలోని బాస్ సాంగ్ దుమ్ములేపగా..ఈరోజు రవితేజ తాలూకా ఫస్ట్ లుక్ టీజర్ సినిమా ఫై అంచనాలు రెట్టింపు చేసింది. వాల్తేరు వీరయ్య లో విక్రమ్ సాగర్ ఏసీపీ పాత్రలో రవితేజ కనిపించబోతున్నాడు. రవితేజ తో గతంలో పవర్ వంటి పవర్ ఫుల్ సక్సెస్ ను ఇచ్చిన బాబీ మరోసారి రవితేజను అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో అలాగే ఈ సినిమాలో కనిపించబోతున్నాడు అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

రవితేజ ఓ చేతిలో గొడ్డలి..మరో చేతిలో చిన్న మేక పిల్ల పట్టుకొని చాల యూనిక్ గా కనిపిస్తున్నాడు. సినిమాలో చిరంజీవి తో సమానమైన హీరో రోల్ చేస్తున్నాడా లేక చిన్న అతిధి పాత్ర చేస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి వాల్తేరు వీరయ్య సినిమాలోని రవితేజ లుక్ అదిరి పోయింది అంటూ అంతా అనుకునే విధంగా లుక్ ఉంది. ప్రస్తుతం రవితేజ పై హైదరాబాద్ లో మరియు చిరంజీవిపై యూరప్ లో వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. రెండు వారాల్లో సినిమా షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టబోతున్నారు. దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.