మాజీ మంత్రి రావెల టిడిపికి రాజీనామా

RAVELA KISHOREBABU
RAVELA KISHOREBABU

మాజీ మంత్రి రావెల టిడిపికి రాజీనామా

ఆ నలుగురికి టికెట్ల నిరాకరణలో రావెల ఔట్‌

అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రాష్ట్ర మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు టిడిపికి శుక్రవారం సాయంత్రం రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి చంద్ర బాబు శుక్రవారమే గెలుపు గుర్రాలకే టికెటిస్తామని గుంటూరు జిల్లాలో మాజీ మంత్రితోపాటు మరో ముగ్గురికి పార్టీ టికెట్లు ఇవ్వనని తేల్చిచెప్పడంతో ఇచ్చినా ఓటమి తప్పదని ఊహించి ఆ నలుగురికి సంకేతాలు పంపారు. దీంతో రావెల పార్టీకి గుడ్‌బై చెప్పారు. గతంలో ఆయన అనేక రాజకీయాల వివాదాలకు కేంద్ర బిందువై నియోజకవర్గంతోపాటు జిల్లాలో రాజకీయ పరిస్థితులు రావెలకు అనుకూలంగా లేవని ముఖ్యమంత్రి ఇప్పటికే రావెలకు టికెట్‌ విషయం తేల్చి చెప్పారు. రావెల వైసిపిలో చేరుతున్నట్లు గత కొంతకాలంగా పుకార్లు షికారు చేశాయి. దీంతో జనసేన పార్టీలో రావెల శనివారం చేరుతున్నట్లు ఆయన అనుచరులద్వారా తెలిసింది. ఆ జిల్లాలో మరో ముగ్గురికి బాబు నిరాకరించడంతో వారు ఎటువైపు పయనిస్తారో లేదా తెలుగుదేశం పట్ల కొనసాగుతారో కాలమే నిర్ణయించాల్సి ఉంది.