నార్త్‌ అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా రత్నాకర్‌

Ratnakar tributes at YSR Statue
Ratnakar tributes at YSR Statue

Vijayawada: ఆంధ్రప్రదేశ్‌లో ప్రవాసాంధ్రులు పెట్టుబడులు పెట్టేలా కృషి చేస్తానని నార్త్‌ అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన రత్నాకర్‌ పేర్కొన్నారు. నార్త్‌ అమెరికాలో ఉన్న ఎన్నారైల సమస్యలను పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు. నార్త్‌ అమెరికాకు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియామకం అయిన తర్వాత ఆయన తొలిసారి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. ఈ సందర్భంగా విజయవాలోని వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహానికి నివాళులర్పించి బాధ్యతలు స్వీకరించారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి రత్నాకర్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ చైర్మన్‌ చల్లా మధుసూదన్‌రెడ్డి కావటి మనోహర్‌ నాయుడు, వైఎస్‌ఆర్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.