పూరీలో ప్రారంభమైన జగన్నాథుడి రథయాత్ర వేడుక

ర‌థం వ‌ద్ద‌కు జ‌గ‌న్నాథుడు, బ‌ల‌భ‌ద్రుడు..

పూరీలో ప్రారంభమైన జగన్నాథుడి రథయాత్ర వేడుక
Rath-Yatra-In-Puri

పురి: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఒడిశాలోని పూరి పట్టణంలో జ‌గన్నాథ ర‌థ‌యాత్ర ప్రారంభమైంది. అయితే కేవ‌లం 500 మంది మాత్ర‌మే ర‌థాన్ని లాగాల‌ని సుప్రీం త‌న ఆదేశాల్లో స్ప‌ష్టంగా పేర్కొన్న‌ది. పూజారులు(సేవాయ‌త్స్‌) ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. జ‌గ‌న్నాథు ఆల‌యంలో ఉన్న సుభద్ర, బ‌ల‌భ‌ద్రుడి ఉత్స‌వ‌మూర్తిని కూడా పూజారులు ఇవాళ ఉద‌యం ర‌థం వ‌ద్ద‌కు తీసుకువ‌చ్చారు. కాగా మధ్యాహ్నం 12.30 గంటలకు పూరీలో రథయాత్ర ప్రారంభంకానుంది. ఇది మొత్తం 9 రోజులు జరిగే వేడుక. తొమ్మిది రోజుల తర్వాత రథాలు… గుండీచా ఆలయాన్ని చేరుకుంటాయి. ప్రపంచంలో ఏటా పూరీలో జరిగేదే ఇదే అతి పెద్ద రథోత్సవం. ఏటా ఇసుక వేస్తే రాలనంత సంఖ్యలో భక్తులు వచ్చేవారు. ఈసారి ఆ కళే కనిపించట్లేదు. కరోనా వైరస్ వ్యాప్తి… రథయాత్రను తీవ్రంగా దెబ్బతీసింది. అయినప్పటికీ సంప్రదాయాల్ని పాటిస్తూ… వేడుక నిర్వహిస్తున్నారు. పరిమిత సంఖ్యలో వేదపండితుల మంత్రోచ్ఛరణలతో పూరీలో రథయాత్ర కార్యక్రమం జరుగుతోంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/