2019 కి విభిన్నంగా వీడ్కోలు పలికిన రతన్‌ టాటా

Ratan Tata
Ratan Tata

ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌టాటా ఈ దశాబ్దంలో తన జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. 2019 సంవత్సరానికి విభిన్నంగా వీడ్కోలు పలికారు. తన 82వ పుట్టిన రోజు కావడంతో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన వారికి ధన్యవాదాలు చెప్పారు. బెంగళూరు ఎయిర్‌ షోలో ఎఫ్‌18 సూపర్‌ విమానంతో దిగిన చిత్రాన్ని పోస్ట్‌ చేస్తూ ఈ విధంగా పేర్కొన్నారు. ఇది కేవలం 2019 సంవత్సరానికి మాత్రమే కాదు ఈ దశాబ్దానికి కూడా ఇది చివరి అంకం అన్నారు. రాబోయే కొత్త దశాబ్దానికి ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నాను అని అన్నారు. ఇది మీ ఆశయాలు నిర్వర్తించడానికి, ఏదైనా సృష్టించడానికి, కొత్త బంధాలు కలపడానికి, చరిత్రలు రాయడానికి మంచి సమయం అన్నారు. బెంగళూరు ఎయిర్‌ షో సందర్భంగా తాను ఎఫ్‌ 18 సూపర్‌ హార్నెట్‌లో విహరించాను. అది నాకు ఈ దశాబ్దంలో ఎంతో ప్రత్యేకమైన సందర్భం అంటూ ఇన్‌స్ట్రాగ్రామ్‌ పోస్టులో వెల్లడించారు. ఈ రోజు ఉదయం నుంచే జన్మదిన శుభాకాంక్షల వెల్లువ ప్రారంభమైంది. దీంతో రతన్‌ టాటా స్పందిస్తూ..నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/