మోహన్‌ భగవత్‌తో రతన్‌ టాటా భేటి

ratan tata, mohan bhagawat
ratan tata, mohan bhagawat


నాగ్‌పూర్‌: ప్రముఖ వ్యాపారవేత్త రతన్‌టాటా ఈ నెల 17న ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ను కలిశారు. నాగపూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధానకార్యాలయంలో సుమారు రెండు గంటలపాటు మాట్లాడుకున్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ రతన్‌ టాటా, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది. వీరి మధ్య సమావేశం జరగడం ఇది రెండవసారి. రెండురోజుల క్రితమే మరో వ్యాపారవేత్త ముకేష్‌ అంబానీ ఓ కాంగ్రెస్‌ ఎంపికి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. ఐతే రతన్‌టాటా మోహన భగవత్‌కు మద్దతు ఇవ్వడానికి వచ్చారా లేదా ఇంకేమైనా విషయం ఉందో ఇంకా తెలియాల్సి ఉంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/