మాస్ స్టెప్పుల రచ్చ రచ్చ

Rashmika, Vijay devarakonda
Rashmika, Vijay devarakonda

తాజాగా బెంగళూరులో జరిగిన డియర్ కామ్రేడ్ మ్యూజిక్ ఫెస్టివల్ లోనూ దేవరకొండ అభిమానులకు అదిరిపోయే ట్రీటిచ్చాడు. విజయ్ – రష్మిక జోడీ వేదికపై అద్భుతమైన డ్యాన్సింగ్ ట్రీట్ ఇచ్చింది. బంగారువర్ణం డిజైనర్ డ్రెస్ లలో చూడముచ్చటైన ఆ జంట అహూతుల్ని మైమరిపించింది. విజయ్ గోల్డ్ కలర్ లాల్చీలో కనిపిస్తే దానికి కాంబినేషన్ గా రష్మిక సైతం గోల్డ్ కలర్ శారీలో మైమరిపించింది. ఆ ఇద్దరూ వేదికపై ఒకరితో ఒకరు పోటీపడుతూ మాస్ స్టెప్పులతో రక్తి కట్టించారు. డ్యాన్సర్ల బృందం రష్మికను తమ భుజాలపైనే మోసుకుని వచ్చి వేదికపై దించి వెళితే అటుపై విజయ్ తో కలిసి డ్యాన్సుల్లో మునిగిపోయింది. ఆ దృశ్యం విజయ్- రష్మిక అభిమానులకు కన్నుల పండుగ అనే చెప్పాలి. ఈ  ఈవెంట్ లో కన్నడ స్టార్ యశ్ ముఖ్య అతిధిగా అలరించారు. బెంగళూరు తరవాత చెన్నయ్.. హైదరాబాద్ లోనూ ఈ తరహా మ్యూజిక్ ఫెస్టివల్స్ ని టీమ్ ప్లాన్ చేస్తోంది.