రష్మిక భలేగా మోటివేషన్ చేసిందే..

రష్మిక మోటివేషన్ కు అంత ఫిదా అవుతున్నారు. గ్లామర్ గా కనిపించడమే కాదు ఇలాంటి మోటివేషన్ లు ఇస్తుందా అని మాట్లాడుకుంటున్నారు. గీత గోవిందం మూవీ తో యూత్ & ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్న రష్మిక..ఆ తర్వాత వరుసగా అగ్ర హీరోల సరసన నటించి అతి తక్కువ టైంలోనే అగ్ర హీరోయిన్ స్థాయికి చేరుకుంది. పుష్ప మూవీ తో పాన్ ఇండియా హిట్ కొట్టి మరింత పాపులర్ అయ్యింది.

కేవలం వెండితెర ఫై మాత్రమే కాదు సోషల్ మీడియా లోను యాక్టివ్ గా ఉంటూ వీడియోస్, పిక్స్ షేర్ చేస్తూ అభిమానులను , ఫాలోయర్స్ ను ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా ఈమె ట్విట్టర్‌ అకౌంట్‌లో ‘సంతోషంగా ఉండండి.. ఆశను కోల్పోవద్దు. ఆనందం, శాంతి అన్నింటి కంటే ఎక్కువే వస్తాయి… నెగెటివ్ ఫీల్స్ విషయంలో జీవితం చాలా చిన్నది’ అని ట్వీట్ చేసింది. అంతేకాదు ఈ పోస్ట్‌తో పాటు తన హాట్ లుకింగ్ ఫొటోను కూడా షేర్ చేసింది. అయితే ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు కొందరు.. మంచి మోటివేషన్ అని రిప్లయ్ ఇస్తున్నారు. ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్‌తో ‘పుష్ప2’ చిత్రంలో నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.