కొరటాల – ఎన్టీఆర్ మూవీ లో రష్మిక ఫిక్స్ అయ్యిందా..?

పుష్ప మూవీ తో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు పొందిన రష్మిక..ప్రస్తుతం అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ గా మారింది. రీసెంట్ గా ‘గుడ్‌ బై’ తో ఆమె బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. శుక్రవారం విడుద‌లైన ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బ‌చ్చ‌న్‌తో క‌లిసి న‌టించింది ర‌ష్మిక‌. అమితాబ్‌కు కూతురిగా ఆమె పోషించిన తార పాత్రకు మంచి స్పందన వ‌స్తోంది. మొన్న‌టిదాకా ఈ చిత్రం ప్ర‌మోష‌న్స్‌లో ర‌ష్మిక బిజీ బిజీగా గడిపింది. ఇదిలా ఉంటె తాజాగా ఈ బ్యూటీ ఎన్టీఆర్ సరసన నటించే ఛాన్స్ కొట్టిసినట్లు ఫిలిం సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ – కొరటాల కలయికలో ఓ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ లో ఎన్టీఆర్ కు జోడిగా పలువురు భామలను అనుకున్నప్పటికీ ఫైనల్ గా రష్మిక ను మేకర్స్ ఓకే చేసారని అంటున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. ప్ర‌స్తుతం ర‌ష్మిక ఖాతాలో ప‌లు చిత్రాలు ఉన్నాయి. హిందీలో ‘మిషన్ మజ్ను’ షూటింగ్ పూర్తి చేసుకున్న ఆమె ‘యానిమల్’లో నటిస్తోంది. తెలుగులో వారసుడు, పుష్ప 2 చిత్రాలు చేస్తోంది.