అమ్మడి డ్రీమ్స్‌పై ‘లాక్ డౌన్’
భారీ సినిమాలకు సంతకాలు

ముఖ్యాంశాలు
- కరోనా లాక్ డౌన్ కారణంగా రష్మిక ఇంటికే పరిమితం
- షూటింగ్స్ మిస్‌అవుతున్నట్టు ఫీల్
- ఫ్యూచర్ సినిమాలపై ఎన్నో ఆశలు
ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రష్మిక విజయ పరంపర కొనసాగుతున్నట్లు కన్పిస్తుంది. ఏ ఇండస్ట్రీలో అయినా కెరీర్ లో ఎదుగుతున్న రష్మిక క్రేజ్ మాములుగా లేదు.
కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన రష్మిక డ్రీం కు బ్రేకులు పడ్డట్లే ఉందట. ఎందుకంటే ఈ కన్నడ బ్యూటీ.. ఫ్యూచర్ సినిమాల మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఆ కల ఈ ఏడాది తీర్చేసుకోవాలని అనుకుందట.
అందుకు తగ్గట్టే ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ విజయాలతో పరిస్థితులు కలిసొచ్చాయట. ఇంతలో మహమ్మారిలా దూసుకొచ్చిన కరోనా రష్మిక టార్గెట్‌పై నీళ్లు చల్లేసింది.
ఇక రష్మిక డ్రీమ్ ఏంటంటే.. రెండు కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవాలని.. రీసెంట్ హిట్ల తర్వాత జోష్ లో ఉన్న రష్మిక రెండు భారీ సినిమాలకు సంతకాలు చేసింది.
అందులో ఒకటి అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్టు ‘పుష్ప’.. కాగా మరొకటి కార్తీ సరసన తమిళంలో మరో సినిమా.
అమ్మడికి లాక్ డౌన్ లో ఉన్న రష్మిక ఇంట్లో ఉండి ఏం చేయట్లేదట.. కానీ షూటింగ్స్ బాగా మిస్ అవుతున్నాను అంటుందట ఈ బ్యూటీ.
తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/