సమంత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రష్మిక

పుష్ప ఫేమ్ రష్మిక..సమంత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గీత గోవిందం మూవీ తో యావత్ సినీ ప్రేక్షకులను మెప్పించిన రష్మిక..ఆ తర్వాత వరుస గా అగ్ర హీరోల సరసన జోడి కడుతూ హిట్స్ కొడుతుంది. కేవలం తెలుగు లోనే కాదు హిందీ , తమిళ్ లోను ఛాన్సులు కొట్టేస్తుంది. ప్రస్తుతం వారసుడు మూవీ తో తెలుగు, తమిళ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సంక్రాంతి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో పాటు హిందీ లో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి మిషన్ మజ్ను మూవీ చేసింది. ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఈ చిత్ర ప్రమోషన్లలో బిజీ గా ఉన్న రష్మిక..ఓ హిందీ ఛానల్ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ రష్మిక గురించి పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసింది.

అయితే, సమంత మయోసైటిస్ కు గురైన విషయం ఆమె ప్రకటించిన తర్వాతే తనకు తెలిసిందని రష్మిక వెల్లడించింది. గతంలో మయోసైటిస్ గురించి తమ మధ్యన ఎప్పుడూ ప్రస్తావన కూడా రాలేదని వివరించింది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక అమ్మలా మారి సమంతను కాపాడుకోవాలనుకుంటున్నానని, ఆమె వెన్నంటి నిలవాలనుకుంటున్నానని రష్మిక తెలిపింది.

జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న వ్యక్తి నుంచి అందరూ స్ఫూర్తి పొందుతారని, ఆ విధంగా తాను కూడా సమంత నుంచి స్ఫూర్తి పొందుతానని రష్మిక పేర్కొంది. తాను ఎంతగానో ఇష్టపడే సామ్ కు ఇకపై అంతా మంచే జరగాలని కోరుకుంటున్నానని తెలిపింది. సమంత ఒక అద్భుతమైన స్త్రీమూర్తి అని పేర్కొంది. ఆమె అందమైనదే కాదు, దయాగుణం కలిగిన వ్యక్తి అని కొనియాడింది. ప్రస్తుతం రష్మిక చేసిన వ్యాఖ్యలు సామ్ అభిమానులను సంతోషానికి గురి చేస్తున్నాయి.