డబ్బింగ్ పూర్తి చేసిన రష్మిక

డబ్బింగ్ పూర్తి చేసిన రష్మిక
Rashmika

నితిన్ హీరోగా ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న చిత్రం ‘భీష్మ’. కాగా ఇటివలే ఈ సినిమా కోసం రష్మిక మండన్న తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టారు. అయితే తాజాగా రష్మిక డబ్బింగ్ పూర్తి అయింది. డబ్బింగ్ చాల బాగా వచ్చిందట. సినిమా అవుట్ ఫుట్ కూడా చాల బాగా వచ్చిందట.

ఇక ఈ సినిమాలో కామెడీ చాల బాగా వస్తోందని తెలుస్తోంది. ముఖ్యంగా వెన్నల కిశోర్ అండ్ నితిన్ ట్రాక్ సినిమాలో హైలెట్ అవుతుందని సమాచారం. మొత్తానికి వెంకీ కుడుముల ‘ఛలో’ మాదిరిగానే ఈ చిత్రాన్ని కూడా ఫుల్ ఎంటెర్టైనింగా మలుస్తున్నాడు. ఇప్పటికే విడుదల అయిన ఈ చిత్రం లోని వీడియో దృశ్యాలు, సింగిల్స్ యాంధం’ గీతం వైరల్ అయ్యాయి. అలాగే భీష్మ ప్రచార చిత్రాలకు కూడా ప్రేక్షకాభిమానులనుంచి విశేషమైన స్పందన లభిస్తోంది.

కాగా ‘భీష్మ’ చిత్ర కధ,కధనాలు,సన్నివేశాలు,సంభాషణలు చాలా కొత్తగా ఉంటాయి. ప్రతి అబ్బాయి నితిన్ క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యేవిధంగా డిజైన్ చెయ్యబడిందట. నితిన్ భీష్మ పై చాలా ఆశలే పెట్టుకున్నాడు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/