హైద‌రాబాద్‌లోని పంజాగుట్ట‌లో యువ‌తిపై అత్యాచారం

బ్యాంకు ఉద్యోగుల‌మ‌ని ప‌రిచ‌యం..యువతితో మాట్లాడుతూ అత్యాచారం

హైదరాబాద్ : హైద‌రాబాద్‌లోని పంజాగుట్ట, డీఎస్‌ మక్తాలో క‌ల‌క‌లం చెల‌రేగింది. ఒంటరిగా వున్న ఓ యువ‌తి ఇంట్లోకి వచ్చిన ఓ వ్య‌క్తి ఆమెపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. తాము బ్యాంక్ నుంచి వచ్చానంటూ ఇద్దరు వ్యక్తులు వచ్చి పరిచయం చేసుకున్నారు. తర్వాత తమ బ్యాంకు నుంచి ఫైనాన్స్‌ ఇస్తామని యువతితో మాట‌లు క‌లిపారు. అనంత‌రం వారిలో ఓ వ్యక్తి ఇంటి బయటకు వెళ్లి కాపలా ఉన్నాడు.

మరో వ్యక్తి ఇంట్లో యువతితో మాట్లాడుతూ ఆపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంత‌రం ఈ ఘటనపై ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో ఆమెను పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుప‌త్రికి తరలించారు. నిందితులను గుర్తించ‌డానికి పోలీసులు అక్క‌డి సీసీటీవీ కెమెరాల‌ను ప‌రిశీలిస్తున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/