డోనాల్డ్ ట్రంప్‌పై మ‌రోసారి రేప్ కేసు..

అమెరికా మాజీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై మ‌రోసారి రేప్ కేసు న‌మోదు చేసేందుకు ఓ మ‌హిళ సిద్ద‌మైంది. 1990 ద‌శ‌కంలో బెర్గ‌డోర్ఫ్ గుడ్‌మ్యాన్ స్టోర్‌లో ప‌నిచేస్తున్న స‌మ‌యంలో డోనాల్డ్ ట్రంప్ త‌న‌పై అత్యాచారం చేసిన‌ట్లు జీన్ కారెల్ అనే మ‌హిళ గ‌తంలో ఫిర్యాదు చేసింది. అయితే ఆ ఘ‌ట‌న‌పైనే మ‌రోసారి ఆమె కోర్టులో దావా వేసేందుకు సిద్ద‌మైంది.

ట్రంప్ కావాల‌నే త‌న‌ను భావోద్వేగానికి లోనయ్యేలా చేశార‌ని ఆమె త‌న దావాలో పేర్కొన్న‌ట్లు ఆమె త‌ర‌పు న్యాయ‌వాది తెలిపారు. 1995 లేదా 96లో మ‌న్‌హ‌ట‌న్‌లో ఉన్న ఓ డిపార్ట్‌మెంట్ స్టోర్‌లోని డ్రెస్సింగ్ రూమ్‌లో ట్రంప్ త‌న‌ను రేప్ చేసినట్లు కారెల్ ఆరోపించారు. న‌వంబ‌ర్ 24న ట్రంప్‌పై కేసు దాఖ‌లు చేయ‌నున్న‌ట్లు కారెల్ లాయ‌ర్ తెలిపారు

ట్రంప్ తనపై అత్యాచారం చేయడం వల్ల తాను మానసిక క్షోభను అనుభవించానని అందుకే తాను కోర్టులో దావా వేయాలని భావిస్తున్నట్లు రచయిత్రి చెప్పారు. కాగా కారోల్‌పై తాను అత్యాచారం చేయలేదని ట్రంప్ చెప్పారు. కారోల్ రాసిన పుస్తకాన్ని విక్రయించడానికి తనపై అత్యాచారం క్లెయిమ్‌ను రూపొందించారని ట్రంప్ ఆరోపించారు.ఇప్పటికే ట్రంప్ రహస్య పత్రాలు తీసుకువెళ్లారని కేసు ఎదుర్కొంటున్నారు.