‘రంగ రంగ వైభవంగా’ చిత్ర టీజర్ విడుదల

ఉప్పెన తో ఇండస్ట్రీ కి పరిచమైన మెగా హీరో వైష్ణవ్ తేజ్..మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకొని సత్తా చాటారు. ఆ ఆతర్వాత కొండపోలం ట్ అనే డిఫరెంట్ మూవీ తో ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు రంగ రంగ వైభవంగా అంటూ సరికొత్త ప్రేమ కథ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ ఎల్ పీ బ్యానర్ పై బీవీఎస్ ఎన్ ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా తమిళ దర్శకుడు గిరీషాయ తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసిన మేకర్స్ , ప్రమోషన్ కార్య క్రమాలపై దృష్టి సారించారు. ఇప్పటికే లిరికల్ వీడియోలని విడుదల చేసి సినిమాపై హైప్ ని క్రియేట్ చేసిన మేకర్స్ తాజాగా ఈ మూవీ టీజర్ ని సోమవారం విడుదల చేశారు.

`నన్నే చూస్తావ్..నా గురించే కలలు కంటావ్..నన్నే ప్రేమిస్తావ్…కానీ ..నీకు నాతో మాట్లాట్టానికి ఈగో.. దీనమ్మా జీవితం మానవత్వం చచ్చిపోయింది భయ్యా.. అంటూ హీరో హీరోయిన్ లు చెబుతున్న డైలాగ్ లు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈగో ని ప్రధానంగా చూపిస్తూ దర్శకుడు రొమాంటిక్ ప్రేమకథని ఎంచుకున్న తీరు హీరో హీరోయిన్ పాత్రలని మలిచిన విధానం యూత్ ను ఎట్రాక్ట్ చేసేలా వున్నాయి. చక్కటి ప్రేమకథతో సిద్ధమైన ఈ సినిమాలో వైష్ణవ్‌ రిషిగా, కేతిక రాధగా నటించారు. వీళ్లిద్దరూ తరచూ గొడవలు పడటం.. ఇగోతో ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను బయటపెట్టకపోవడం.. ఇలా పలు సన్నివేశాలు చూస్తే పవన్‌కల్యాణ్‌ నటించిన యూత్‌ఫుల్‌ సినిమా ‘ఖుషి’ గుర్తుకు వస్తుంది. టీజర్‌ చివర్లో వచ్చే డైలాగ్‌లు యువతను అలరించేలా ఉన్నాయి. వైష్ణవ్ తేజ్ నటన కేతిక గ్లామర్ ఈ మూవీకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నట్టుగా తెలుస్తోంది. మరి వీరిద్దరి గిల్లికజ్జాలు చూడాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే. ఈ లోపు మీరు టీజర్ ను చూసెయ్యండి .

YouTube video