రంగ్ దే ఫ్లాప్‌కు కారణం నిజంగా అదేనా?

యంగ్ హీరో నితిన్, అందాల భామ కీర్తి సురేష్ జంటగా దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ‘రంగ్ దే’ చిత్రం గతవారం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై చిత్ర యూనిట్ భారీ నమ్మకం పెట్టుకుంది. రిలీజ్‌కు ముందే ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ కావడంతో ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. అయితే రిలీజ్ తరువాత ఈ సినిమాకు మిక్సిడ్ టాక్ రావడంతో పాటు ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది.

దీంతో రంగ్ దే చిత్రాన్ని చూసేందుకు ఆడియెన్స్ ఎవరూ ఆసక్తి చూపలేదు. కాగా ఈ సినిమా కలెక్షన్లు కూడా అంతంత మాత్రంగా నమోదు కావడంతో ఈ సినిమా ఫ్లాప్ దిశగా వెళ్తోంది. ఇక ఈ శుక్రవారం నాడు బాక్సాఫీస్ వద్ద వరుసగా సినిమాలు రిలీజ్ కానుండటంతో రంగ్ దే పరిస్థితి అయోమయంగా మారింది. అయితే ఈ సినిమా ఫెయిల్యూర్ కావడానికి ముఖ్య కారణం కోవిడ్ పరిస్థితి అని అంటున్నారు చిత్ర యూనిట్. ప్రస్తుతం కోవిడ్ కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతుండటంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఎవరూ థియేటర్లకు రావడం లేదని రంగ్ దే చిత్ర యూనిట్ అంటోంది.

అయితే ఈ సినిమాలో కథ రొటీన్ కావడంతోనే ప్రేక్షకులు ఈ సినిమాను రిజెక్ట్ చేశారని, కోవిడ్ పరిస్థితులు ఉన్నా ప్రేక్షకులు సినిమాలు చూసేందుకు వస్తున్నారని, కథ బాగాలేకపోతే వారు సినిమాను ఆదరించరని విమర్శకులు అంటున్నారు. ఏదేమైనా సినిమా ఫెయిల్ కావడానికి కోవిడ్‌ను కారణంగా చూపించడం సరైనది కాదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.