రాహుల్‌ గాంధీకి సమన్లు జారీ చేసిన రాంచీ సివిల్‌ కోర్టు

Rahul Gandhi
Rahul Gandhi

రాంచీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ లోక్‌ సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని దొంగ అని చేసిన వ్యాఖ్యలకు రాంచీ సివిల్‌ కోర్టు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 22న కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ..నరేంద్ర మోడీ, నీరవ్‌ మోడీ, లలిత్‌ మోడీ వీరందరికి కామన్‌గా మోడీ అని ఎందుకుంది? అని ప్రశ్నించారు. ఎందుకంటే దొంగలందరి ఇంటి పేరు మోడీనే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బోపాల్‌కు చెందిన ప్రదీప్‌ మోడీ అనే వ్యక్తి సివిల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ప్రదీప్‌ మోడీ మాట్లాడుతూ..కావాలనుకుంటే మీరు సంబంధిత వ్యక్తుల పేర్లతో ఆరోపణలు చేసుకోవచ్చన్నారు. కానీ ఒక సామాజిక వర్గాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించడం సరి కాదని ఆయన హితవు పలికారు. తాను కోర్టుకు వచ్చినప్పుడు కొందరు మిత్రులు తనను హేళన చేశారని చెప్పారు. ఎంతో ఆవేదనకు గురైన తాను పరువునష్టం దావా వేశానని ప్రదీప్‌ మోడీ తెలిపారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/