యాక్షన్‌ అడ్వంచర్‌కు ఓకే

వినూత్నమైన సినిమాకు రానా గ్రీన్‌సిగ్నల్‌

Rana Daggubati
Rana Daggubati

జాతీయ నటుడు రానా ఎప్పుడూ ఎక్కువగా వైవిధ్యమైన సినిమాలు చేయటానికి ఆసక్తిచూపుతున్న సంగతి తెలిసిందే..

ఇపుడు అలాంటి మరో వినూత్నమైన సినిమా చేయటానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని బాలీవుడ్‌ మీడియాలో విన్పిస్తోంది..

ఈ సినిమాకు బాలీవుడ్‌ దర్శకుడు మిలింద్‌ రౌ దర్శకత్వం వహించబోతున్నట్టు తెలిసింది..

మిలింద్‌ ఇప్పటికే రానాకు కథను కూడ వివరించారని, రానాకి కథ బాగా నచ్చిందని తెలుస్తోంది.. ఈసినిమా ఆతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగే పక్కా యాక్షన్‌ అడ్వెంచర్‌ అని తెలుస్తోంది..

కాగా ఇటీవలే రానా వివాహం మిహికా బజాజ్‌తో హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే..

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/