యస్ బ్యాంక్‌లో ప్రమోటర్ల వాటాల సేల్

yes bank
yes bank

న్యూఢిల్లీ : యస్ క్యాపిటల్, మోర్గాన్ క్రెడిట్స్, రాణా కపూర్‌లు తమ వాటాలను విక్రయించారని ప్రైవేటురంగ యస్ బ్యాంక్ సోమవారం వెల్లడించింది. యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రానా కపూర్ తన 2.04 కోట్ల షేర్లను బహిరంగ మార్కెట్లో విక్రయించారు. ఈ వాటాల అమ్మకం తర్వాత బ్యాంకులో రానా కపూర్ వాటా 0.8 శాతానికి పడిపోయింది. నవంబర్ 13 నుంచి 14 తేదీలలో ప్రమోటర్లు మొత్తం 2.04 కోట్ల షేర్లను విక్రయించినట్లు యస్ బ్యాంక్ స్టాక్ మార్కెట్‌కు తెలియజేసింది. ఇప్పుడు వారికి మొత్తం 900 షేర్లు మిగిలి ఉన్నాయి. రాణా కపూర్ వాటాలను విక్రయించారనే వార్తలు వెలువడడంతో బ్యాంక్ షేర్లు 2.66 శాతం క్షీణించి రూ.64.15 వద్ద ముగిశాయి.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/