రానా బర్త్ డే స్పెషల్ : భీమ్లా నాయక్ నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది

దగ్గుపాటి రానా పుట్టిన రోజు ఈరోజు (డిసెంబర్ 14). ఈ సందర్భాంగా సోషల్ మీడియా లో అభిమానులు , సినీ ప్రముఖులు ఆయనకు బెస్ట్ విషెష్ అందజేస్తున్నారు. ఈ క్రమంలో భీమ్లా నాయక్ చిత్ర యూనిట్ సరికొత్త పోస్టర్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. అంతే కాదు మంగళవారం సాయంత్రం 4:05 గంటలకు మరో అప్‌డేట్‌ను విడుదల చేస్తామని పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ వెల్లడించింది. డానియల్ శేఖర్‌తో ఎన్‌కౌంటర్‌కు సిద్ధంగా ఉండాలని పోస్ట్ చేసింది. మరి రానా కు సంబదించిన టీజర్ ఏమైనా రిలీజ్ చేస్తారేమో అని అభిమానులు భావిస్తున్నారు.

రానా , పవన్ కళ్యాణ్ కలయికలో భీమ్లా నాయక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సాగర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే , మాటలు అందించడం విశేషం. ప్రస్తుతం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని , పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. జనవరి 12 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.