బ్రేకింగ్ న్యూస్ : మహేష్ బాబు అన్న రమేష్ బాబు మృతి

బ్రేకింగ్ న్యూస్ : మహేష్ బాబు అన్న రమేష్ బాబు మృతి

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో విషాద ఛాయలు అల్లుకున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడైన రమేష్ బాబు (56) మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న రమేష్ బాబు,శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కాలేయ వ్యాధితో ఇబ్బందులు పడుతోన్న ఆ‍యన, శనివారం (జనవరి 08) రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో.. కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రమేష్ బాబు మరణించినట్టు డాక్టర్లు తెలిపారు.

1974 అల్లూరి సీతారామరాజు చిత్రంతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు రమేష్ బాబు. దాదాపు 17 చిత్రాల్లో నటించడమే కాదు పలు చిత్రాలను నిర్మించాడు కూడా. చైల్డ్ ఆర్టిస్ట్‌గా చాలా సినిమాల్లో కనిపించాడు. మనుషులు చేసిన దొంగలు, పాలు నీళ్లు, నీడ వంటి చిత్రాల్లో ఆయన చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఆకట్టుకున్నాడు. హీరోగా ‘సామ్రాట్’ మూవీతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. కానీ, హీరోగా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. దీంతో నిర్మాతగా మారాడు. మహేష్ బాబు నటించిన “అతిధి, అర్జున్” చిత్రాలకు రమేష్ బాబు నిర్మాతగా వ్యవహరించారు. రమేష్ బాబు మృతితో ఘట్టమనేని ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం మహేష్ బాబు కరోనాతో బాధపడుతున్నాడు. మరి ఆయన అన్నను చూడడానికి వస్తారా..? రారా ..? అనేది తెలియాల్సి ఉంది. ఇక రమేష్ బాబు మరణం పట్ల చిత్రసీమ సంతాపం తెలియపరుస్తున్నారు.