రేపే ‘రామారావు ఆన్ డ్యూటీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ జులై 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శరత్ మాండవ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో ర‌వితేజ ఎం.ఆర్‌.ఓ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు.ఓ సిన్సియ‌ర్ గ‌వ‌ర్న‌మెంట్ ఆఫీస‌ర్ అవినీతి రాజ‌కీయ నాయ‌కుల భ‌ర‌తం ఎలా పట్టాడ‌నేదే సినిమా. ఇందులో ర‌జిషా విజ‌య‌న్‌, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్‌ గా నటించారు.

ఇప్పటికే ఈ చిత్ర పలు సాంగ్స్, ట్రైలర్ , టీజర్ ఆకట్టుకోగా రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ గా గ్రాండ్ గా జరపబోతున్నారు. హైదరాబాద్ – ఫిల్మ్ నగర్ .. జేఆర్సీ కన్వెన్షన్ లో ఈ వేడుక నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. రవితేజ అభిమానులు ‘వైట్ షర్ట్స్’తో రావాలని ఈ పోస్టర్ ద్వారా చెప్పారు. ఈ సినిమాతోనే తొట్టెంపూడి వేణు రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇతర ముఖ్యమైన పాత్రల్లో నాజర్ .. పవిత్ర లోకేశ్ కనిపించనున్నారు.