రంజాన్ మాసం విశిష్టత

ఆధ్యాత్మికం

Ramadan
Ramadan

ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ రంజాన్. రంజాన్ మాసం ఎంతో పవిత్రమైంది. ఈ మాసంలో ముస్లిం సోదరులు పరమ నిష్ఠతో చేసి ఉపవాసం గొప్పది. దీనినే రంజాన్ ఉపవాసం అంటారు.. ఆధ్యాత్మిక ఉట్టిపడే ఈ పండుగ పరమార్ధంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ సందర్భంగా చేయు ప్రార్ధనను నమాజు అంటారు. కఠోర నియమాలను అనుసరించి చేయు ఉపవాస దీక్ష రంజాన్ మాసం విశిష్టత. ముఖ్యంగా ఈ మాసంలో పవిత్ర గ్రంధం ఖురాన్ చదవటం అల్లాను భక్తి శ్రద్ధలతో ప్రార్ధన చేయటం , పేదలకు సహాయ పడటం వంటివి మనకు కనిపిస్తాయి .. ముస్లిం సోదర సోదరీమణులకు ఆధ్యాత్మికతను కలిగించే ఈ పవిత్ర మాసం క్రమశిక్షణకు నిదర్శనం.. ఎందరికో ఆదర్శం..

రంజాన్ మాసంలో నరకం గేట్లు మూసి వుంటాయని కనుక పేదలకు దాన ధర్మాలు చేయటం ద్వారా పుణ్యం సంప్రాప్తిసుందని ముస్లిం సోదరుల ప్రగాఢ నమ్మకం.. అందుకే ఈ పవిత్ర రంజాన్ మాసంలో వీరు నిరుపేదలకు ధన ధర్మాలు చేస్తారు ప్రార్ధన వలన ఎన్నో ప్రయోజనాలు ఆత్మ జ్ఞానం సిద్ధిస్తుంది… ఆయా సమయాల్లో ఈ ప్రదానాలు చేయటం ప్రధాన ఆధారం ..

మానసిక ఆరోగ్యం కలుగుతుంది.. నెల రోజుల పాటు జరిగే రంజాన్ మాసం ఒక అపురూపం .. ఆధ్యాత్మిక చైతన్యం అందుకే ముస్లిం సోదరులకు ఈ పండుగ అంటే చాల ఇష్టం . అల్లా అందరినీ చల్లగా కాపాడాలని, ఆశీస్సులు అందించాలని వీరి ప్రార్ధనలో కోరుకోవటం విశేషం.. పవిత్రమైన గ్రంధం ఖురాన్ చదవటం ఈ మాసం విశేషం.. అందుకే పవిత్ర మాసంగా ఈ రంజాన్ మాసం నిలిచిపోతుంది..

The holy month of Ramadan

నెలవంక కనిపించటంతో ప్రారంభం అయినా ఈ రంజాన్ పండుగ పరమాదం ముగింపులో కూడా నెలవంక కన్పించటంతో రంజాన్ పండుగ సందడి కన్పిస్తుంది.. ఈ సందర్భంగా ఒకరి నొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు.. ఈ పండుగా సందర్భంగా చేయు నమాజు ప్రత్యేక ప్రార్ధన ఒక ఆధ్యాత్మిక అనుభూతి , మానసిక ప్రశాంతత కలజజేస్తుంది..

అందరికీ ఒక్కడే దైవం రంజాన్ ఉపవాసం దీక్ష అద్భుతం కలది.. రంజాన్ పండుగ పరమాదం అందరూ తెలుసుకోవాలి.. ఈ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు హిందువులను కూడా ఆహ్వానిస్తారు. అందరూ ఒక్కటేనన్న భావన వారిది.. అలా సమైక్యతా భావం చాటి చెప్పే రంజాన్ పండుగ అంటే అందరికీ ఎంతో ఇష్టం..

–ఎల్ . ప్రఫుల్ల చంద్ర

తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/